: కృష్ణా కరకట్ట ఆక్రమణదారులకు నోటీసులు: గుంటూరు కలెక్టర్ ఆదేశం
నవ్యాంధ్ర నూతన రాజధాని పరిధిలోని కృష్ణా కరకట్టలను ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజధాని భూసేకరణ విధుల్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆక్రమణదారుల అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కరకట్టలను ఆక్రమించడంతో పాటు వాటిలో విలాసవంతమైన భవన సముదాయాలను నిర్మించిన వారందరికీ నోటీసులు జారీ చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు చేశారు. ఈ నెల 15 లోగా నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు భూసేకరణను పూర్తి చేయాలని సూచించారు.