: ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను దేశ ప్రజలకు అంకితమిచ్చిన లియాండర్ పేస్
టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ (41) తాను గెలిచిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను భారతీయులందరికీ అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ప్రపంచవేదికపై జాతికి ప్రాతినిధ్యం వహించడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో పేర్కొన్నాడు. ప్రోత్సాహక సందేశాలతో ప్రేరణ కలిగిస్తున్న అందరికీ ఈ టైటిల్ అంకితమిస్తున్నానని ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పేస్ మార్టినా హింగిస్ తో కలిసి మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. పేస్ కెరీర్లో ఇది 15వ టైటిల్. ఈ దిగ్గజం సాధించిన అపూర్వ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొనియాడారు.