: 12న ప్రపంచకప్ ఆరంభ వేడుకలు... ఉర్రూతలూగించనున్న ఆసీస్ సింగర్స్


మరో 11 రోజుల్లో (ఈనెల 14న) ఐసీసీ ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా వరల్డ్ కప్ ఫీవర్ లో మునిగిపోయారు. మొత్తం 14 జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో... ఐసీసీ సభ్యత్వం ఉన్న 10 టీమ్ లు నేరుగా అర్హత సాధించగా, ఐర్లాండ్, యూఏఈ, ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్ లు మిగిలిన నాలుగు బెర్త్ లు సాధించుకున్నాయి. ఈ బెర్త్ లు సాధించడం కోసం ఈ జట్లు నాలుగేళ్ల పాటు కష్టపడ్డాయి. మరో వైపు, ఈ నెల 12న ప్రపంచకప్ ఆరంభ వేడుకలు మెల్ బోర్న్ లోని ప్రఖ్యాత ఔట్ డోర్ ఆడిటోరియం 'సిడ్నీ మైర్ మ్యూజిక్ బౌల్'లో అట్టహాసంగా జరగనున్నాయి. ఆరంభ వేడుకల టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయి. ఈ వేడుకల్లో ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత సింగర్లు జెస్సికా మబాయ్, నథానియల్, డారిల్ బ్రాత్ వెయిట్, టినా ఎరీనాలు తమ ఆట, పాటలతో ఉర్రూతలూగించనున్నారు. మరో విషయం ఏమిటంటే, అదే రోజు సాయంత్రం న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో కూడా వేడుకలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆ దేశానికి చెందిన ప్రఖ్యాత కళాకారులు పాల్గొంటారు.

  • Loading...

More Telugu News