: ఇషాంత్, రోహిత్ వరల్డ్ కప్ సన్నద్ధతపై సందేహాలు!


మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ఆరంభం కానుంది. క్రికెట్ అభిమానులకు మజా అందించే ఈ టోర్నీ కోసం ఇప్పటికే జట్లను ప్రకటించారు కూడా. అయితే, టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. పేసర్ ఇషాంత్ శర్మ, బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ లు గాయాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరికీ వరల్డ్ కప్ ఆరంభానికి ముందు ఫిబ్రవరి 7న ఫిట్ నెస్ పరీక్ష నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీరిద్దరితో పాటు యువ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాల ఫిట్ నెస్ ను కూడా అదే రోజున పరీక్షించనున్నారు. ఈ నలుగురు ఆటగాళ్లకు రెండు రకాల ఫిట్ నెస్ టెస్టులు నిర్వహిస్తారు. అందులో నెగ్గిన ఆటగాళ్లను, ఈ మరుసటి రోజు ఆస్ట్రేలియా జట్టుతో జరిగే వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ లో బరిలో దింపుతారు. తద్వారా వారి మ్యాచ్ ఫిట్ నెస్ ను కూడా పరీక్షిస్తారు. అనంతరం వారిపై ఓ నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News