: ఈ వేసవిలో తెలంగాణకు చంద్రబాబు కరెంట్ సరఫరా చేస్తారట!


వేసవి ప్రారంభం కాకముందే... రాబోతున్న కరెంటు కష్టాలను తలచుకుంటే గుండె గుభేల్ మంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే కరెంట్ యుద్ధాలు కూడా కొనసాగుతున్నాయి. తెలంగాణలో అయితే కరెంట్ కష్టాలు మరీ ఎక్కువ. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందు చూపు లేకపోవడం వల్లే తెలంగాణకు కరెంటు కష్టాలు వచ్చాయనేది విపక్ష నేతల ఆరోపణ. ఈ నేపథ్యంలో, టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తెలంగాణ వాసులకు ధైర్యం నూరిపోస్తున్నారు. రానున్న వేసవిలో తెలంగాణకు చంద్రబాబు కరెంట్ సరఫరా చేస్తారని తెలిపారు. గతంలో కూడా చంద్రబాబు కరెంట్ ఇస్తామని ప్రకటించారని... అయితే, చంద్రబాబుకు లేఖ రాయడానికి కేసీఆర్ సిగ్గుపడ్డారని ఆరోపించారు. కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు చెప్పినప్పటికీ కేసీఆర్ పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణకు ఏపీ నుంచి కరెంట్ ఇప్పించే బాధ్యతను తాము తీసుకుంటామని ఎర్రబెల్లి తెలిపారు.

  • Loading...

More Telugu News