: పెళ్లి చేసుకునేందుకు ఖైదీకి సెలవు మంజూరు చేసిన కోర్టు
తమిళనాడులోని పుళల్ జైలులో కోవై బాంబు పేలుడు కేసులో శిక్షను అనుభవిస్తున్న ఎస్.అహ్మద్ కు పెళ్లి చేసుకునేందుకు వీలుగా పెరోల్ మంజూరు చేస్తున్నట్టు మద్రాసు హైకోర్టు తెలిపింది. అంతకుముందు, తన కుమారుడికి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశామని, అందుకోసం 20 రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేయడానికి జైలు అధికారులను ఆదేశించాలని అహ్మద్ తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి శివజ్ఞానం ఖైదీ వివాహం చేసుకునేందుకు 20 రోజుల వరకు సెలవు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.