: బెంగళూరులో అడుగుపెట్టొద్దంటూ తొగాడియాకు నోటీసు!
వీహెచ్ పీ నేత ప్రవీణ్ తొగాడియాను బెంగళూరులోకి ప్రవేశించవద్దంటూ నగర పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ నెల 5 నుంచి 10 వరకు ఆయన ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపారు. 'హిందూ విరాట్ సమావేశ' పేరిట ఈ నెల 8న బెంగళూరులో వీహెచ్ పీ భారీ సదస్సు నిర్వహించనుంది. ఇందులో తొగాడియా మాట్లాడాల్సి ఉంది. అయితే, రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడంలో ప్రసిద్ధుడైన ఆయనపై ఇప్పటికే పలు కేసులున్నాయి. ఈ కారణంతోనే అయన బెంగళూరులోకి ప్రవేశించడాన్ని నిషేధించారట. మరోవైపు, ఈ సదస్సు తరువాత కర్ణాటకలో 'ఘర్ వాపసీ' కార్యక్రమం చేపట్టాలని వీహెచ్ పీ ప్లాన్ చేస్తోందట.