: ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారు... ఎవరికి ఓటేసినా బీజేపీకి వెళుతోంది: కేజ్రీవాల్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో బీజేపీ ఎన్నో 'తప్పు'టడుగులు వేస్తోందని, అందులో భాగంగా పెద్దఎత్తున ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. నిన్న ఢిల్లీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తాను నాలుగు ఈవీఎంలు పరిశీలించానని, అన్నింటినీ ట్యాంపర్ చేశారని ఆయన తెలిపారు. ఎవరికి ఓటేసినా బీజేపీకి వెళుతోందని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కు తెలియజేశామని కేజ్రీవాల్ వివరించారు.

  • Loading...

More Telugu News