: అందాల పోటీలో విస్తుగొలిపే ఘటన


బ్రెజిల్ లో ప్రతి సంవత్సరం 'మిస్ అమెజాన్' పేరిట అందాల పోటీలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అలాగే నిర్వహించిన సందర్భంగా విస్తుగొలిపే ఘటన చోటు చేసుకుంది. విజేతకు అలంకరించిన కిరీటాన్ని ఫస్ట్ రన్నరప్ విసిరికొట్టింది. వివరాల్లోకెళితే... శుక్రవారం నాడు మనౌస్ నగరంలో 'మిస్ అమెజాన్-2015' పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో కరోలినా టోలెడో (20)ను విన్నర్ గానూ, షీస్లేన్ హయల్లా (23)ను ఫస్ట్ రన్నరప్ గా ప్రకటించారు. అయితే, ఉన్నట్టుండి హయల్లా ముందుకురికి టోలెడో తలపైనున్న కిరీటాన్ని లాగి, విసిరికొట్టింది. డబ్బు వెదజల్లి విజేతగా నిలిచిందని, కిరీటాన్ని కొనుక్కుందని ఆరోపించింది. 'మిస్ అమెజాన్' గా ఆమె అనర్హురాలని విమర్శించింది. దీనిపై విజేత టోలెడో మాట్లాడుతూ, నమ్మశక్యం కాని భావన కలుగుతోందని పేర్కొంది. కాగా, అనుచితంగా ప్రవర్తించిన హయల్లాపై ఏడాది పాటు ఎలాంటి పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తారని తెలుస్తోంది. అటు, విజేత టోలెడో ఈ ఏడాది 'మిస్ బ్రెజిల్' పోటీల్లో పాల్గొననుంది.

  • Loading...

More Telugu News