: త్వరలో శ్రీలంక కొత్త అధ్యక్షుడి భారత్ పర్యటన
భారత్, శ్రీలంక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ఆ దేశాల అధ్యక్షులు ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో లంక నూతన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ నెల 16న భారత్ రానున్నారు. లంక ఎన్నికల్లో సిరిసేన విజయం సాధించిన సమయంలో ఫోన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడే భారత్ రావాలని ఆహ్వానించారు. ఇందుకు వెంటనే సిరిసేన కూడా అంగీకరించారు. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక బయటి దేశంలో ఆయన పర్యటన ఇదే మొదటిది. ఇదిలాఉంటే వచ్చే మార్చిలో 13, 15 తేదీల్లో కొలంబోలో మోదీ పర్యటించే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ కొలంబో ఆంగ్ల పత్రిక తెలిపింది. అయితే ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.