: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ దే విజయం... బీజేపీకి 29, ఆప్ కు 35 సీట్లు: తాజా సర్వే


మోదీ మ్యాజిక్ మసకబారిందా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తాజా సర్వే ఆ విషయాన్నే స్పష్టం చేస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతున్న ఎన్నికల పోరులో కేజ్రీవాల్ దూసుకుపోతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీ రాష్ట్రంలో పగ్గాలు చేపట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాల్నిచ్చే అవకాశం అంతంతమాత్రమే. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ 35 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఎబిపి న్యూస్- నీల్సన్ తాజా సర్వే వెల్లడించింది. 29 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందని, కాంగ్రెస్‌కు గత ఎన్నికలకంటే తక్కువగా ఈసారి ఆరు సీట్లు మాత్రమే రావొచ్చని అంచనా వేసింది. మరోసారి హంగ్ అసెంబ్లీకే అవకాశం కనిపిస్తోందని తెలిపింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగిన కిరణ్ బేడీ కంటే కేజ్రీవాల్ నాయకత్వం పట్లే ప్రజలు మొగ్గు చూపుతున్నారని సర్వే పేర్కొంది.

  • Loading...

More Telugu News