: రజనీకాంత్ వియ్యంకుడిపై అరెస్ట్ వారెంట్... చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు గైర్హాజరు ఫలితం


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వియ్యంకుడు, నటుడు ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజాపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి చెన్నైలోని జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెన్నై షావుకారుపేటకు చెందిన ఫైనాన్షియర్ ముకున్‌ చంద్‌ బోద్రా వద్ద దర్శకుడు కస్తూరిరాజా 2012లో రూ.65 లక్షల రుణం తీసుకున్నారు. అందుకుగాను కస్తూరిరాజా రెండు చెక్కుల్ని ఇచ్చారు. చెక్కులు బ్యాంకులో బౌన్స్ అవడంతో బాద్రా, చెన్నై జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిన్న జరిగిన కోర్టు విచారణకు కస్తూరిరాజా తరఫున ఎవ్వరూ హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి కస్తూరిరాజాపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

  • Loading...

More Telugu News