: విశాఖలో మాఘపౌర్ణమి వేడుకలు... తీరంలో వేలాది మంది భక్తుల పుణ్య స్నానాలు
మాఘపౌర్ణమిని పురస్కరించుకుని నేటి తెల్లవారుజాము నుంచి విశాఖ రేవు, పోలవరం తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. ప్రతి ఏడాదీ ఈ రోజున సముద్రంలో పుణ్యస్నానాలాచరించడం ఆనవాయతీగా వస్తోంది. దాంతో నేటి తెల్లవారుజాము నుంచి లక్షలాది మంది భక్తులు సముద్రంలో పుణ్యస్నానాలు చేశారు. ఏటా మాఘపౌర్ణమి సందర్భంగా సముద్ర తీరానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్యను ముందుగానే అంచనా వేసిన అధికార యంత్రాంగం పుణ్యస్నానాల కోసం భారీ ఏర్పాట్లు చేసింది.