: ఏపీలో మళ్లీ ఉష్ణోగ్రతలు డౌన్... గుత్తెడులో అత్యల్పంగా 2 డిగ్రీల సెల్సియస్ నమోదు


ఏపీలో మరోమారు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా గుత్తేడులో రాత్రి 2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా, రంపచోడవరంలో 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఎజెన్సీ గిరిజనం చలితో వణికిపోతోంది. పది రోజుల క్రితం చలిపులి పంజాతో వణికిపోయిన గిరిజనులు, మరోమారు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో ఇబ్బందులు పడుతున్నారు. క్రమంగా కాకుండా ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో భారీ తగ్గుదల నమోదు కావడంతో గిరిజన గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ చలి పెరిగింది.

  • Loading...

More Telugu News