: నష్టాన్ని మనమే పూడ్చేద్దాం... ప్రజలపై భారం వద్దు: చంద్రబాబు ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఓకే!
ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు సీఎం నారా చంద్రబాబునాయుడు ససేమిరా అన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు వస్తున్న నష్టాలను సర్కారే భరించేలా నిన్న జరిగిన కేబినెట్ భేటీ తీర్మానించింది. ‘‘విద్యుత్ పంపిణీ సంస్థల నష్టం భర్తీ కావాలి. అంతే కదా. దానికి ప్రజలపై భారం వేయడం ఎందుకు? సర్కారు నిధులు సర్దుబాటు చేస్తే సరిపోతుంది కదా? నష్టాలంటూ పంపిణీ సంస్థలు పేర్కొంటున్న రూ.700 కోట్లను ఎలాగోలా సర్దేద్దాం. విద్యత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరిద్దాం’’ అంటూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. దీంతో ఏపీ ప్రజలకు విద్యుత్ చార్జీల పెంపు తప్పదన్న వార్తలు నీరుగారిపోయాయి.