: వరల్డ్ కప్ లో చోటు దక్కకుంటే రిటైర్ కావాలా? : సెహ్వాగ్


వన్డే ప్రపంచకప్ లో చోటుదక్కనంత మాత్రాన రిటైర్మెంట్ ప్రకటించనని టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఢిల్లీలో సెహ్వాగ్ మాట్లాడుతూ, మరో రెండేళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతానని అన్నాడు. తానిప్పటికీ క్రికెట్ ఆడుతున్నానని, ఆడినంత కాలం క్రికెట్ లో కొనసాగుతానని సెహ్వాగ్ చెప్పాడు. ఆటపై మక్కువ తీరనంత వరకు ఆడుతూనే ఉంటానని పేర్కొన్నాడు. మరో రెండేళ్ల వరకు క్రికెట్ ఆడే సత్తా తనలో ఉందని వెల్లడించాడు. కాగా, వరల్డ్ కప్ లో యువీతో పాటు సెహ్వాగ్ కు కూడా చోటు కల్పించని సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News