: ఆవేశంలో రాజీనామా చేశా...ఉపసంహరించుకుంటున్నా: నరేంద్ర టాండన్


ఆవేశంలో రాజీనామా చేశానని...దానిని ఉపసంహరించుకుంటున్నానని ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ఎన్నికల ప్రచార సహాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ రాజీనామా చేసిన నరేంద్ర టాండన్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాజీనామా ఉపసంహరించుకుంటున్నానని, ఆవేశంతో రాజీనామా చేసినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. కిరణ్ బేడీ, అనుచరులు అవమానిస్తున్నారని ఉదయం పార్టీకి రాజీనామా చేసిన నరేంద్ర టాండన్, పార్టీ అధిష్ఠానం బుజ్జగింపులతో మధ్యాహ్నానానికి ఉపసంహరించుకున్నారు.

  • Loading...

More Telugu News