: పాఠశాల టీచర్ల గదిలో కోటిన్నర
గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని కేంద్రీయ విద్యాలయంలోని అధ్యాపకుల గదిలో కోటి రూపాయల విలువైన బంగారం, 59 లక్షల విలువైన నగదు దొరకడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... ఓఎన్జీసీ ప్రాంగణంలోని పాఠశాలలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. అధ్యాపకుల గదిలో ఉన్న పాతలాకర్ ను శుభ్రం చేస్తుండగా నగదు, బంగారం లభ్యమైనట్టు అధ్యాపకులు తెలిపారు. ఈ నగలు, నగదు తమవని ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటిని పోలీసులకు అప్పగించగా, వారు ఆదాయపు పన్ను శాఖకు అప్పగించినట్టు తెలిపారు.