: బోరుబావిలో పడిన పాపను కాపాడిన స్థానికులు
నోరు తెరచిన బోరుబావులు పసివారిపేరిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. తాజాగా బోరుబావిలో పడిన ఓ చిన్నారిని స్థానికులు కాపాడి మానవత్వం చాటుకున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం చిన్నరాజుకుప్పం గ్రామంలో నాలుగేళ్ల పాప 30 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయింది. అది చూసిన స్థానికులు వెంటనే బోరుబావిలో తాడు వేసి జాగ్రత్తగా బాలికను వెలికి తీశారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.