: ధోనీ కి ఎంజాయ్ మెంట్ లేదా?
టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఎంజాయ్ మెంట్ లేదా? అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. టీమిండియా ఆటగాళ్లందరికీ వారం రోజులపాటు బీసీసీఐ హాలీడే ప్రకటించింది. అంతే కాదు, భార్య, కుటుంబం, ప్రియురాళ్లతో ఎంజాయ్ చేస్తామంటే చేయొచ్చని తెలిపింది. దీంతో టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ మొత్తం సంబరాలకోసం ఎదురు చూస్తుండగా, కెప్టెన్ ధోనీ మాత్రం ఏ సందడీ లేకుండా ఉన్నాడట. తన భార్యను కలిసేందుకు కూడా ధోనీ భారత్ వెళ్లడం లేదని సమాచారం. దీనంతటికీ కారణం ధోనీ భార్య సాక్షి ఈ నెల అతనిని తండ్రిని చేయనుంది. భార్య నిండు చూలాలు కావడంతో ధోనీ భార్యతో ఎంజాయ్ చేసేందుకు వెళ్లడం లేదని, వరల్డ్ కప్ మధ్యలో తన భార్య ప్రసవం జరిగే సమయంలో తిరిగి రావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ధోనీకి టెన్షన్ తప్ప ఆనందం లేదని సహచరులు చెబుతున్నారు. ఆసీస్ సిరీస్ ఆరంభం నుంచే ధోనీ గతంలో ఉన్నంత సదరాగా లేడని, కారణాలు తెలియడం లేదని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.