: చంద్రబాబు ఆటగాడైన వేళ!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాసేపు బ్యాడ్మింటన్ ఆటగాడిగా మారిపోయారు. ఏపీ రాజధాని విజయవాడలో 79వ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన సందర్భంగా ఆయన, మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ గా అలరించారు. బాబుకు ప్రత్యర్థులుగా పివీ సింధు, కశ్యప్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తామని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన స్టేడియంలను నిర్మిస్తామని ఆయన తెలిపారు. క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగం కావాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూళ్లలాగే స్పోర్ట్స్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.