: చేప పొట్టలో లక్షలాది రూపాయల విలువైన సంపద?
నెల్లూరు జిల్లాలో ఓ చేప పొట్టలో విలువైన సంపద దొరికిందన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకూరుపేట మండలం రాముడుపాళెం, పల్లిపాళెం సముద్రతీరానికి 35 అడుగుల భారీ చేప కొట్టుకొచ్చింది. ఈ భారీ చేప నాలుగు నుంచి ఐదు టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. అయితే ఇది రెండు రోజుల క్రితమే మృతి చెంది ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. దీనిని చూసిన కొందరు చేప పొట్టభాగం కోసి చూశారని, అందులో లక్షలాది రూపాయల విలువైన వస్తువులు దొరికాయని ప్రచారం జరుగుతోంది. ఆ నోటా ఈ నోటా విషయం విన్న పోలీసులు, దానిపై ఆరాతీస్తున్నారు. చేపను ఎవరు ముందుగా చూశారు? పొట్ట ఎవరు కోశారు? వంటి విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.