: వేలానికి డిస్నీలాండ్ వస్తువులు
అమెరికాలోని ప్రముఖ ఎమ్యూజ్ మెంట్ పార్క్ డిస్నీలాండ్ లోని పాత వస్తువులను వేలానికి ఉంచారు. సుమారు వెయ్యి వస్తువులను వేలం వేయనున్నట్టు డిస్నీలాండ్ వర్గాలు తెలిపాయి. కాగా, 1955లో డిస్నీ లాండ్ ను ఏర్పాటు చేశారు. వేలానికి పురాతనమైన అపురూప కళాఖండాలను పెట్టినట్టు తెలుస్తోంది. వేలం ద్వారా 1 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరవచ్చని డిస్నీలాండ్ అంచనా వేస్తోంది. డిస్నీలాండ్ కు పర్యాటకులు, చిన్నపిల్లలు మంచి అభిమానులు. తాము వేలం వేసే వస్తువులకు మంచి ధరపలుకుతుందని, అభిమానులు ఎగబడతారని డిస్నీలాండ్ ఆశిస్తోంది.