: గంగూలీని ఫాలో అయ్యేందుకు సచిన్, ద్రావిడ్ నిరాకరించారట!
విఖ్యాత లార్డ్స్ మైదానంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి విజయగర్వం ప్రదర్శించడం అప్పట్లో సంచలనం అయింది. ఇంగ్లండ్ పై నాట్ వెస్ట్ ట్రోఫీ విజయాన్ని గంగూలీ ఆ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తనలాగే అందరూ చొక్కాలు విప్పి గాల్లో ఊపాలని కెప్టెన్ హోదాలో జట్టు సభ్యులను కోరాడట. అయితే, జట్టులో సీనియర్ ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు గంగూలీని ఫాలో అయ్యేందుకు అంగీకరించ లేదని ఆ సమయంలో టీమిండియా మేనేజర్ గా వ్యవహరించిన రాజీవ్ శుక్లా వెల్లడించారు. వాంఖెడే మైదానంలో సిరీస్ సమం చేసిన ఆనందంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ చొక్కా విప్పినందుకు ప్రతిగా, తాము కూడా అలాగే చేయాలని గంగూలీ భావించాడని శుక్లా వివరించారు. అయితే, సచిన్ తదితరులు మాత్రం దాదా విజ్ఞప్తికి సున్నితంగానే 'నో' చెప్పారని తెలిపారు.