: గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుంది: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ లో ఆ పార్టీ తెలంగాణ నేతలు సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లలో పోటీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ ఎన్నికల కోసం ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.