: విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్ సీ సిఫారసుకు ఏపీ క్యాబినెట్ 'నో'
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై ఈరోజు మంత్రివర్గ సమావేశంలో వాడీ వేడి చర్చ జరిగింది. 10 శాతం మేర విద్యుత్ ఛార్జీలు పెంచాలంటూ కొన్నిరోజుల కిందట ప్రభుత్వానికి ఈఆర్ సీ సిఫారసు చేసింది. అయితే, ఈ సిఫారసును ఒప్పుకునేది లేదని మంత్రివర్గం స్పష్టం చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపు విషయంపై మరోసారి భేటీ అయి చర్చించాలని నిర్ణయించింది. ఇటు, రాష్ట్రంలో ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీకి ప్రత్యామ్నాయాలు ఆలోచిద్దామని సీఎం చంద్రబాబు సూచించారు.