: 'అత్యంత ఆరాధ్య పురుషుడు' జాబితాలో పోప్ ను వెనక్కినెట్టిన మోదీ


'యు-గవ్' సంస్థ విడుదల చేసిన 'ప్రపంచ అత్యంత ఆరాధ్య పురుషుడు' జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఐదోస్థానం లభించింది. ఈ జాబితాలో పోప్ ఫ్రాన్సిస్ కు ఆరోస్థానం దక్కింది. సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ ఉన్నారు. ఇక, ఫ్రాన్సిస్ తర్వాత టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా ఏడోస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు 11వ స్థానం లభించగా, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు 14వ స్థానం దక్కింది. 'యు-గవ్' సంస్థ మొత్తం 23 దేశాల్లో జరిపిన అధ్యయనం ఆధారంగా ఈ జాబితా రూపొందించారు.

  • Loading...

More Telugu News