: సచివాలయానికి వాస్తు దోషం లేదు... తెలంగాణకు కేసీఆర్ దోషం ఉంది: మోత్కుపల్లి


సచివాలయానికి వాస్తు దోషం ఉందంటూ... దాన్ని ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రికి తరలిస్తామని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సంహులు తప్పుబట్టారు. సచివాలయానికి కాని, తెలంగాణకు కాని ఎలాంటి వాస్తు దోషం లేదని... కేసీఆరే పెద్ద దోషమని మండిపడ్డారు. ఈ రోజు టీటీడీపీ నేతలు ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ, సచివాలయానికి వాస్తు దోషం ఉందంటూ చెస్ట్ ఆసుపత్రిని తరలించాలనుకోవడం దారుణమని అన్నారు. ఈ ఆసుపత్రిని ఎర్రగడ్డలోనే ఉంచాలని, లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ చెస్ట్ ఆసుపత్రికి రోజూ 50 వేల మందికి పైగా రోగులు వస్తారని జూబ్లీహిల్స్ టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.

  • Loading...

More Telugu News