: 'గోపాల గోపాల' సినిమా ప్రదర్శన నిలిపివేయండి... హైకోర్టులో పిటిషన్
'గోపాల గోపాల' చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ చేపట్టిన కోర్టు, పిటిషన్ వెనక్కి తీసుకుని మరో పిటిషన్ దాఖలు చేయాలని సదరు పిటిషనర్ కు ఆదేశించింది. ఈ సినిమా దర్శక, నిర్మాతలను కూడా ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. అంతకుముందు కూడా ఈ చిత్ర ప్రదర్శన ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని రఘునాథరావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. పవన్ కల్యాణ్, వెంకటేష్, శ్రియ తదితరులు నటించిన ఈ చిత్రం జనవరిలో విడుదలై విజయం సాధించిన సంగతి విదితమే.