: 'ప్రపంచ ఆరాధ్య మహిళ'గా ఏంజెలినా జోలీ


హాలీవుడ్ అందాల నటి ఏంజెలినా జోలీ 'ప్రపంచంలో అత్యంత ఆరాధ్య మహిళ'గా నిలిచింది. నోబెల్ శాంతి పురస్కార విజేత మలాలా యూసఫ్ జాయ్, అమెరికా మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్, క్వీన్ ఎలిజబెత్-2, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలను వెనక్కునెట్టి జోలీ ముందు వరుసలో నిలవడం విశేషం. తాజాగా 25,000 మందితో ఇంటర్నెట్ బేస్డ్ మార్కెట్ సంస్థ 'యు-గవ్' ఓ అధ్యయనం నిర్వహించింది. దేశవ్యాప్తంగా 23 దేశాల్లో జరిపిన ఈ పోల్ లో ప్రతి ఒక్క దేశం వివిధ రకాల ఫలితాలను ఇచ్చిందట. ఇందులో, ఆరుగురు పిల్లల తల్లి, అమెరిక ప్రత్యేక రాయబారి అయిన జోలీకి అంతర్జాతీయంగా ఈ గౌరవం దక్కినట్టు డెయిలీమెయిల్ వెబ్ సైట్ పేర్కొంది. మలాలాకు ద్వితీయ స్థానం దక్కగా, మూడవ స్థానంలో హిల్లరీ క్లింటన్ ఉన్నారు. ఇక సోనియా 13వ స్థానంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News