: బీహార్లో బీజేపీ నేతను కాల్చిచంపిన దుండగులు... తీవ్ర ఉద్రిక్తత


బీహార్లోని మున్గర్ పట్టణంలో బీజేపీ కిసాన్ మోర్చా నేత పంకజ్ వర్మను దుండగులు కాల్చి చంపడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత పంకజ్ తన ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే మరణించగా, వందలాది మంది బీజేపీ మద్దతుదారులు రహదారులను దిగ్బంధించి నిరసన తెలిపారు. పోలీసులపై రాళ్ళు రువ్వి, మూడు వాహనాలను తగులబెట్టారని ఒక పోలీసు అధికారి వివరించారు. ఈ హత్యను రాష్ట్ర ప్రభుత్వమే చేయించిందని వారు నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన అధికారులు పెద్దఎత్తున బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. కాగా, ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో హత్యకు గురైన మూడవ బీజేపీ నేత పంకజ్ వర్మ. రాజకీయంగా ఎదుర్కొనలేకే ప్రభుత్వం హత్యలను ప్రోత్సహిస్తోందని పంకజ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News