: ఆ గ్రామంలోకి వెళ్లాలంటే చెప్పులు చేతబట్టుకోవాల్సిందే!


వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం! నెల్లూరు జిల్లా చుట్టి వాసులు ఇప్పటికీ గ్రామంలోకి ప్రవేశించే సమయంలో చెప్పులు కాళ్లకుండవు... వారి చేతుల్లో కనిపిస్తాయి. ఏదో నిమ్నవర్గాల వారు మాత్రమే దీనిని పాటిస్తున్నారనుకుంటే పొరబడ్డట్టే. గ్రామంలోని అన్ని కులాలు, మతాల వారు కూడా ఈ ఆచారాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే, "చెప్పులతో ఊళ్లోకి ప్రవేశిస్తే... చెడు జరుగుతుందండి బాబూ" అని చుట్టి వాసులు సమాధానమిస్తారు. ఏళ్ల తరబడి ఆ గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతోందట. గ్రామంలోకి ప్రవేశించాలంటే, గ్రామ దేవత ఉన్న ఆలయాన్ని దాటుకుని వెళ్లాలి. గ్రామదేవత ఆలయం ముందు చెప్పులేసుకుని నడిస్తే, కీడు తప్పదని తమ పెద్దలు చెప్పారని గ్రామస్థులు చెబుతున్నారు. చిత్రంగా ఉంది కదూ? అయినా వారు పెట్టుకున్న ఆచారాన్ని వారే సంతోషంగా ఆచరిస్తుంటే, మనకు చిత్రమైతేనేం... విచిత్రమైతేనేం! వారు మాత్రం ఊరు సమీపంలోకి చేరుకోగానే ఎప్పటిలానే చెప్పులు చేతబట్టి ఊళ్లోకి అడుగుపెట్టడం కొనసాగుతూనే ఉంది.

  • Loading...

More Telugu News