: ప్లాస్టిక్ సర్జరీ అంటే 'మాంసంతో తయారైన బురఖా' వంటిది: వాటికన్ నివేదిక


మహిళలు తమ అందాన్ని పెంచుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించడం సరికాదని, ప్లాస్టిక్ సర్జరీ అంటే 'మాంసంతో తయారైన బురఖా' వంటిదన్న తీవ్ర వ్యాఖ్యలు వాటికన్ తాజా నివేదికలో ఉన్నట్టు తెలిసింది. 'మహిళల సంస్కృతి: సమానత్వం మరియు భేదాలు' పేరిట ఈ నివేదిక విడుదల కాగా, కాస్మెటిక్ సర్జరీల పట్ల మహిళలు ఆకర్షితులు కారాదని వాటికన్ సూచించింది. సర్జరీల వల్ల ముఖం నుంచి భావ వ్యక్తీకరణ తగ్గిపోతుందని, స్త్రీత్వం లోపిస్తుందని, ఇతర సమస్యలు అనేకం వస్తాయని వెల్లడించింది. కాగా, ఈ నివేదికను కౌన్సిల్ ముందు విచారణ కోసం ఉంచారు. వారు ఇచ్చే తుది నివేదిక అనంతరం వాటికన్ నుంచి ప్లాస్టిక్ సర్జరీలపై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.

  • Loading...

More Telugu News