: అధిష్ఠానం ఆదేశిస్తే సనత్ నగర్ నుంచి పోటీ చేస్తా: మర్రి శశిధర్ రెడ్డి
కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే తప్పకుండా సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తాను అధిష్ఠానాన్ని కలిసే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాగా, తనపై దానం నాగేందర్ చేసిన ఆరోపణలను ఆశీర్వాదంగా భావిస్తానని, తాను ఏవైనా తప్పులు చేశానని దానం చెబితే సరిదిద్దుకుంటానని తెలిపారు. మరోవైపు, ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు ఈ స్థానం కోసం పోటీపడుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ లోకి వెళ్లడంతో ఆ ప్రాంతానికి ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది.