: విశాఖలో కూలిన కమ్యూనిటీ హాల్ గోడ... ఇద్దరు మృతి
నిన్న విజయవాడలోని విద్యాధరపురం, నేడు విశాఖపట్నంలోని గాజువాక పరిధిలోని వడ్లమూడి! కూలిపోయిన భవనాల శిథిలాలు కూలీల ప్రాణాలను బలిగొన్నాయి. నిన్న విద్యాధరపురంలోని పురాతన భవనానికి చెందిన శ్లాబ్ కూలిపోయిన ప్రమాదంలో పనిలో నిమగ్నమైన ఇద్దరు కూలీలు చనిపోగా, ఓ మేస్త్రీకి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా, వడ్లమూడిలో కమ్యూనిటీ హాల్ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.