: ధర్నాలు చేపట్టేది నాకోసం కాదు: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ధర్నాలకే పరిమితమని బీజేపీ, కాంగ్రెస్ విమర్శించడంపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ధర్నాలు చేపట్టేది తన కోసం కాదని స్పష్టం చేశారు. ప్రజల కోసమే ధర్నాలు చేస్తానని ఉద్ఘాటించారు. మోదీ సర్కారు నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అంతేగాకుండా, గ్యాస్ సిలిండర్లపై సబ్బిడీ ఎత్తివేసేందుకు యోచిస్తోందని, అదే జరిగితే ప్రజలనెత్తిన మరో బండ పడ్డట్టేేనని అన్నారు. ఇక, ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 'జన్ ధన్ యోజన' పథకంపైనా కేజ్రీవాల్ విమర్శలు చేశారు. బ్యాంకు అకౌంట్ ఉన్నంతమాత్రాన బతుకు బండి నడవదని, అందులో డబ్బు కూడా ఉండాలని వ్యాఖ్యానించారు.