: చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చిన శిశువు అదృశ్యం... కర్నూలు జిల్లా ఆదోనిలో ఘటన
స్వల్ప అస్వస్థతకు చికిత్స చేయిద్దామని ఆసుపత్రికి తీసుకొచ్చిన చిన్నారి బాలుడు క్షణాల వ్యవధిలో అదృశ్యమయ్యాడు. పుట్టిన ఏడు రోజులకే కన్నకొడుకు దూరం కావడంతో, సదరు బాలుడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు పిల్లాడిని ఎత్తుకెళ్లిన వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. తల్లిదండ్రుల దృష్టి మరల్చిన ఓ వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో, ఆసుపత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.