: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం పాసులపై జీసస్ బొమ్మ... భక్తుల ఆగ్రహం
తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద అన్యమత ప్రచారం కలకలం రేపింది. స్వామివారి కల్యాణం పాసులపైనే జీసస్ చిత్రం ముద్రించి ఉండటంతో భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. భజరంగదళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టి రహదారులపై బైఠాయించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారిని తక్షణం సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యవహారానికి సఖినేటిపల్లి ఎంపీడీవో బాధ్యుడని తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కల్యాణం పాసులపై ఏసుక్రీస్తు చిత్రాన్ని ముద్రించడాన్ని తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు.