: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నివాసాన్ని పరిశీలించిన అసెంబ్లీ అధికారులు
హైదరాబాద్ ఆనంద్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసాన్ని ఈరోజు ఏపీ అసెంబ్లీ అధికారులు పరిశీలించారు. నివాసం పక్కన ఉన్న స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసినట్టు చెవిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దాంతో, అధికారులు ఎమ్మెల్యే నివాసం వద్ద పరిశీలనలు జరిపారు. అనంతరం, చెవిరెడ్డి నుంచి అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ వివరణ తీసుకున్నారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్ కు నివేదిక సమర్పించనున్నారు. దీనిపై చెవిరెడ్డి మాట్లాడుతూ, ఇతర ఎమ్మెల్యేల మాదిరిగానే తానూ నిర్మించుకున్నానని చెప్పారు. ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదన్నారు. వర్షం పడినప్పుడు లోపలికి నీళ్లు కారుతున్న భవనాన్ని మాత్రమే నవీకరించానని తెలిపారు.