: మాదిగలపై చంద్రబాబుది మోసం... కేసీఆర్ ది కక్ష సాధింపట


ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ రూటే సపరేటు. ఎప్పుడు ఎవరికి మద్దతిస్తారో? ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తారో? అంచనా వేయడం తలపండిన రాజకీయ విశ్లేషకులకు సైతం కష్టమే. తాజాగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై మంద కృష్ణ ధ్వజమెత్తారు. మాదిగలకు ఇద్దరు ముఖ్యమంత్రులు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు మాదిగలను మోసం చేస్తే... కేసీఆర్ కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసి 'పెద్ద మాదిగ'ను అవుతానని చెప్పిన చంద్రబాబు తన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగ కులానికి చెందిన రాజయ్యను పదవి నుంచి తొలగించి కేసీఆర్ పెద్ద తప్పు చేశారని మండిపడ్డారు. ప్రస్తుత తీరును మార్చుకోకపోతే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News