: టాయిలెట్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తే పోలీసులు నవ్వారు!


చెన్నై మహానగరంలో దొంగలకు కొదవలేదు. వీధిలైట్లు మొదలుకొని చెత్తకుండీల వరకు వారి బారిన పడుతుంటాయి. తాజాగా, వారు పబ్లిక్ టాయిలెట్ యూనిట్ ను కూడా వదల్లేదు. నగరంలో ఏర్పాటు చేసిన రూ.80,000 విలువ చేసే మాడ్యులర్ టాయిలెట్ యూనిట్ కనిపించకుండా పోవడంతో చెన్నై కార్పొరేషన్ తో పాటు పుణేకు చెందిన సరాప్లాస్ట్ సంస్థ కూడా అవాక్కయింది. ఈ అత్యాధునిక టాయిలెట్ యూనిట్ ను సరాప్లాస్ట్ సంస్థే ఏర్పాటు చేసింది. చెన్నై నగరంలోని 12 ప్రాంతాల్లో ఇలాంటివి 42 యూనిట్లు ఏర్పాటు చేశారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు చెన్నైలో ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సరాప్లాస్ట్ ప్రతినిధులకు వింత అనుభవం ఎదురైంది. ఫిర్యాదు నమోదు చేసుకోకపోగా, వారిని చూసి పోలీసులు గొల్లున నవ్వారు. "ఎవరో మీ టాయిలెట్ ఎత్తుకెళ్లారా? దొంగలు దాంతో ఏం చేసుకుంటారు?" అంటూ ఫిర్యాదు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. దీంతో, సరాప్లాస్ట్ కంపెనీ ఇప్పుడు మిగతా టాయిలెట్ల భద్రతపై తీవ్రంగా ఆందోళన చెందుతోంది. అందుకే, టాయిలెట్ల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించాలని యోచిస్తోంది.

  • Loading...

More Telugu News