: అమెరికా-భారత్ సంబంధాలపై చైనా భయపడాల్సిన అవసరం లేదు: ఒబామా


ఇటీవల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ లో పర్యటించడం, ఈ సందర్భంగా బలోపేతమైన ఇరు దేశాల సంబంధాలపై చైనా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. తాజాగా వాటిపై స్పందించిన ఒబామా, కొన్ని విశ్వసనీయ అంశాలే తమను భారత్ కు దగ్గరకు చేశాయన్నారు. దీనిపై చైనా అంతగా భయపడాల్సిన అవసరం లేదని, న్యూఢిల్లీతో వాషింగ్టన్ కు మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఇటీవల ఓ అంతర్జాతీయ ఆంగ్ల ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మూడు రోజుల భారత్ పర్యటన గురించి ఒబామా వివరించారు. "చైనా అటువంటి ప్రకటనలు చేయడం విని నేను ఆశ్చర్యపోయాను. విలువలు ప్రతిబింబించే భారత్ ప్రజాస్వామ్యమే మా సంబంధాలకు పునాది. అందుకే ఏదో ఒక అనుబంధం ఉందని నేను భావిస్తాను. మా అమెరికా ప్రజలు కూడా అలాగే అనుకుంటారనుకుంటున్నా" అన్నారు.

  • Loading...

More Telugu News