: 'కిరణ్ బేడీ ఓ నియంత' అంటూ బీజేపీకి రాజీనామా చేసిన నరేంద్ర టాండన్


వివిధ రాజకీయ పార్టీల నేతలు బీజేపీలోకి వలసలు వెళుతుంటే, ఆ పార్టీ కీలక నేత నరేంద్ర టాండన్ మాత్రం రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ ఎన్నికల ప్రచార ఇన్‌ఛార్జిగా టాండన్ వ్యవహరిస్తున్నారు. మరోవారంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టాండన్ తప్పుకోవడం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమేనని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు పంపిన టాండన్, కిరణ్ బేడీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆమె సన్నిహితులు తనను పలుమార్లు హేళన చేశారని తెలిపారు.

  • Loading...

More Telugu News