: ఢిల్లీలో చర్చిపై దాడి... కలకలం


ఓ చర్చిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఘటన గత అర్ధరాత్రి ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. చర్చిలో ప్రార్థనకు ఉపయోగించే వస్తువులను ఆగంతుకులు చెల్లా చెదురు చేశారు. మరికొన్నింటిని పగలగొట్టారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. క్రైస్తవులు భారీ సంఖ్యలో చర్చి వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఘటనకు బాధ్యులైన వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News