: విజయవాడలో పుల్లెల గోపీచంద్ కు సన్మానం


జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు విజయవాడలో ఘన సన్మానం జరిగింది. 'రోటరీ విజయవాడ మిడ్ టౌన్ ఒకేషనల్ ఎక్స్ లెన్స్ పురస్కారం'తో ఇక్కడి రోటరీక్లబ్ ప్రతినిధులు ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ, రోటరీ అవార్డు పొందడం సంతోషంగా ఉందన్నారు. బ్యాడ్మింటన్ అకాడమీ కోసం ఎంతో కష్టపడ్డామని, ప్రపంచ బ్యాడ్మింటన్ టాప్-100లో తమ అకాడమీ క్రీడాకారులున్నారని చెప్పారు. క్రమశిక్షణ, శ్రమించే తత్వం ఉంటే విజయాలు తథ్యమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News