: తేలిన అప్పుల లెక్క... తెలంగాణ అప్పు రూ.61,710 కోట్లు, ఎపీకి రూ.86,340 కోట్లు


ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు చేసిన అప్పులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పంచుతూ నోటిఫై చేసింది. సెక్యూరిటీల విక్రయం, నాబార్డు, చిన్నమొత్తాల పొదుపు సంస్థ నుంచి చేసిన అప్పులు తదితర వివాదాలు లేని రుణాల జాబితాను మాత్రమే విభజించి, జనాభా ప్రాతిపదికన వాటాల వివరాలు తేల్చారు. ఉమ్మడి రాష్ట్రానికి రూ.1.48 లక్షల కోట్ల అప్పు ఉండగా, అందులో తెలంగాణకు రూ.61.71 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.86.34 వేల కోట్లు పంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక, విదేశీ ఆర్థిక సంస్థలు, కేంద్రం మంజూరు చేసిన రూ. 18.43 వేల కోట్ల రూపాయల అప్పులో రెండు రాష్ట్రాల వాటా తేల్చాల్సి ఉంది.

  • Loading...

More Telugu News