: ఐపీఎల్ జట్టును కొన్నావో... నీ అంతు చూస్తాం: త్రిష కాబోయే భర్తకు బెదిరింపులు!


త్రిష కాబోయే భర్తను హత్య చేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయట. దీంతో త్రిష తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల త్రిష, ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్‌ మణియన్‌ల నిశ్చితార్థం వేడుకగా జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో ఎటువంటి భాగస్వామి అయినా, అంతు చూస్తామని ఆయనకు ఫోన్‌ కాల్స్ వస్తున్నాయట. దీంతో వరుణ్‌ నిన్న తేనాంపేట పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. తనను బెదిరిస్తున్న ఆగంతుకులెవరో తెలుసుకుని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే, తనకసలు చెన్నై జట్టు కొనుగోలు ఆలోచనే లేదని వరుణ్ స్పష్టం చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News