: ఆత్మహత్య చేసుకుంటున్నామన్న వ్యాపారి ఆచూకీ లభ్యం... నాగ్ పూర్ వెళుతుండగా అరెస్ట్
కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కలకలం రేపిన హైదరాబాదు, వనస్థలిపురం వ్యాపారి సుబ్బారావు ఆచూకీ లభ్యమైంది. ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని తన సోదరుడికి సూసైడ్ నోట్ పెట్టిన సుబ్బారావు అదృశ్యమైన ఘటన నిన్న కలకలం రేపింది. సుబ్బారావు సోదరుడి ఫిర్యాదు నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు అతడిని పట్టేశారు. నాగ్ పూర్ వెళ్తున్న సుబ్బారావు కుటుంబాన్ని పోలీసులు ఆదిలాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.