: బంజారాహిల్స్ లో దారుణం... విద్యార్థినిపై నాలుగు రోజుల పాటు ఆటో డ్రైవర్ కీచక పర్వం
హైదరాబాదులోని బంజారాహిల్స్ లో నేటి ఉదయం దారుణం వెలుగు చూసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై నగరానికి చెందిన ఆటో డ్రైవర్ శివ నాలుగు రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ లో బాలికను కిడ్నాప్ చేసిన శివ, ఖమ్మం తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు ఆమెపై కీచకపర్వం కొనసాగించాడు. బాలిక అదృశ్యంపై సమాచారం అందుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.