: ఆ ‘బడా బాబు’లెవరో?... శ్రీవారి మెట్టు వద్ద రూ.2 కోట్ల ఎర్రచందనం దుంగలు పట్టివేత


చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలో నేడు పోలీసు, అటవీ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. తిరుపతి నుంచి తిరుమలకు దారితీసే శ్రీవారి మెట్టు సమీపంలో దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను ఈ శాఖలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ దుంగలను తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిని విచారించిన క్రమంలో పలు కీలకాంశాలు తెలిశాయని పోలీసు శాఖ వర్గాలు చెబుతున్నాయి. చంద్రగిరి మండలం కేంద్రంగా ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న బడా స్మగ్లర్ల పేర్లను పట్టుబడ్డ స్మగ్లర్లు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న బడా బాబులను త్వరలోనే అరెస్ట్ చేసి తీరతామని పోలీసులు చెబుతున్నారు. మరి ఆ బడా బాబులెవరో చంద్రగిరి వాసులతో పాటు మనకూ త్వరలోనే తెలియనుంది.

  • Loading...

More Telugu News